మన్యం న్యూస్, మంగపేట.
సోమవారం మంగపేట మండలంలోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రం లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ మాట్లాడుతూ 17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలకు చరమగీతం పాడి భారత దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన చత్రపతి శివాజీ సాధించిన అనేక పోరాటాల నుండి స్ఫూర్తి పొందుతూ చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు కులగట్ల నరేష్ రెడ్డి, కార్యదర్శి ఆత్మకూరు సతీష్ గారు ఉపాధ్యక్షులు కస్పా ముకుందం గారు కార్యవర్గ సభ్యులు గోలి నరేష్, ఎస్ డి,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.