UPDATES  

 సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి..

  • సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి
  • ఆది వాసి సేన రాష్ట్ర సహాయక కార్యదర్శి పోలేబోయిన ఆదినారాయణ

మన్యం న్యూస్, మంగపేట.

ఆదివాసి సంఘాల నాయకులు మేధావులు యువకులు అందరూ ఐక్యంగా మేడారం జాతర అభివృద్ధి పనులు భాగస్వాములు అవ్వాలని ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో మేడారం జాతర ప్రసిద్ధి చెందెలా నిర్వహించాలి.

ఆదివాసి ప్రజల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఆదివాసీ ఆసియాలోని అతిపెద్ద ఆదివాసుల జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వనదేవతల జన జాతర ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న జాతరకు తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల ఆదివాసీ ప్రజలు వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. పుష్యమాగా మాసంలో ఆదివాసుల ఇలవేల్పుల జాతర్లను వారి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ జాతరను జరుపుకుంటారు. కోట్లాదిమంది ప్రజలు హాజరయ్యే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, పూజారులు,తలపతుల విశిష్టమైన కృషికి ఆదివాసి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా వన దేవతల జన జాతర కుంభమేళను తలపించే విధంగా కొనసాగుతుంది. ఈ దేశ మూలవాసులు ఆదివాసుల ఆచార విశ్వాసాలు ప్రత్యేకమైనవి చెట్టు, పుట్ట, గట్టు, ప్రకృతిని పూజించే వన దేవతల జాతర రెండేళ్లకొక్కసారి వచ్చే ఫిబ్రవరి మాసం మాఘశుద్ధ పౌర్ణమి రోజున వనం నుంచి జనంలోకి తల్లులు ఆగమనం ఆదివాసుల సాంప్రదాయ బద్ధంగా జరుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఆదివాసుల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు వెంటనే ప్రకటించాలి అని పోలె బోయిన ఆదినారాయణ కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !