మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దార్ గా మొగిలి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపర్డెంట్ గా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ ను పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చర్ల మండలం తాసిల్దారుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇదివరకు ఎమ్మార్వో గా పనిచేసిన అనంత రామకృష్ణ బదిలీపై హన్మకొండ కు వెళ్లడం జరిగింది. బాధితులు స్వీకరించిన నూతన ఎమ్మార్వో శ్రీనివాస్ కు పత్రిక మిత్రులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు ఏవి అయినా సరే తన వద్దకు వచ్చి నేరుగా సంప్రదించవచ్చననీ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తారని అంటూ మీ అందరి సహాయ సహకారాలు నాకు ఇవ్వాలని ఆయన అన్నారు.