కన్నడ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తనదైన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. నా మోడలింగ్ తొలి సంపాదన రూ. 5 వేలు అని చెప్పుకొచ్చారు. అక్కడి నుండి స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.
