పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ‘సందేశ్‌ఖాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేవు. రాష్ట్రప్రభుత్వం కూడా ఆయనను సమర్థించకూడదని’ హైకోర్టు పేర్కొంది
