ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇంతకుముందు నిర్ణయించినట్లు మార్చి 31 వరకు అది కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను అదుపుచేసి తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు నిషేధం తప్పదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
