‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఇందులో బాగంగా ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్(జవాన్), ‘ఉత్తమ నటిగా నయనతార(జవాన్) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సందీప్ వంగా(యానిమల్), ఉత్తమ నటుడిగా (నెగెటివ్ రోల్) బాబీ డియోల్ నిలిచారు. క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్, ఉత్తమ గీత రచయితగా జావేద్ అక్తర్ సహ పలువురు విజేతలుగా నిలిచారు.
