భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. సారలమ్మకు గిరిజనులు సాక పోసి గిరిజన సంప్రదాయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపై బయల్దేరారు. ఎల్లుండి గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. మహాజాతరకు 4 రోజుల్లో 2 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
