కన్నడ సోయగం రష్మిక మందన్నకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. నటన పరంగానే కాదు, ఫ్యాషన్ రంగంలో కూడా రష్మిక ముందుంటుంది. తాజాగా రష్మిక కొత్త లుక్లో దర్శనమిచ్చింది. ఇటలీలో జరుగుతున్న మిలాన్ ఫ్యాషన్ వీక్ 2024లో పాల్గొని ర్యాంప్పై వాక్ చేసింది. రష్మిక జపనీస్ ఫ్యాషన్ లేబుల్ అయిన ఒనిత్సుకా టైగర్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.
