ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898AD’. మే 9న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మే 9లోపు ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ పూర్తికావడం కష్టమని, అందుకే సినిమాను ఆగష్టు 15కు వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
