తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 14వ శతాబ్దం నేపథ్యంలో యుద్ధ వీరుడు కంగువ కల్పిత కథను ఈ సినిమా ద్వారా చెప్పనున్నారు. ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు హీరో సూర్య తెలిపారు. అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోలో సూర్యాతో డైరెక్టర్ శివ టెక్నీషియన్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశారు.
