స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన ‘స్థానిక ఎమ్మెల్యే డబ్బు చెల్లించి హీరోయిన్ త్రిషతో గడిపాడు’ అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై త్రిష తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆయనపై విమర్శులు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు చెబుతూ.. తాను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని, తన మాటలను తప్పుగా వక్రీకరించారని తెలిపారు.
