ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కల్కి’ టీజర్ కు సంబంధించిన రన్ టైమ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ల నిడివితో త్వరలోనే టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. మే 9న సినిమా విడుదల కానుంది.
