హీరో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రాయన్’. ధనుష్ 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ధనుష్ సరసన జాతీయ అవార్డు పొందిన నటి అపర్ణ నటించనుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
