తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందని వార్తలు వచ్చాయి. వీటిపై అట్లీ మాట్లాడుతూ..”జవాన్ కంటే మంచి కథ దొరికితే ఆయనతో కచ్చితంగా మరోసారి పనిచేస్తాను. కథ కుదిరాక ఆయన్ను కలుస్తాను. నా జీవితంలో చూసిన గొప్ప వ్యక్తుల్లో షారుఖ్ ఒకరు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను” అన్నాడు
