‘ప్రేమ కావాలి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇషా చావ్లా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష ప్రధాన నాయిక కాగా.. సురభి, ఇషా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పలు చిత్రాలతో అలరించిన ఇషా.. పదేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
