మన్యం న్యూస్, మంగపేట.
రాజుపేట ను మండల కేంద్రం చేయాలి వినతి పత్రం రాజుపేటను మండలం కేంద్రం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగపేట మండలం తహసిల్దారు కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు చౌలం సాయిబాబు మాట్లాడుతూ రాజపేట చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 16 పైగా ఉంటాయి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలు మంగపేట మండల కేంద్రానికి రావాలంటే చార్జీలు విపరీతంగా పెరగడం వలన మారుమూల ప్రాంతాల ప్రజలు అయినటువంటి తక్కల్ల గూడెం, చింతకుంట, చీపురుదుబ్బ,అఖినేపళ్లి మల్లారం, దోమడ, తదితర ప్రాంతాల నుంచి మంగపేట రావాలంటే రాలేని పరిస్థితిలో ఉన్నారని వెంటనే రాజుపేట మండల కేంద్రం చేయాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘ నాయకులు సోయం సీతయ్య కొమరం సందీప్ తదితరులు పాల్గొన్నారు.