UPDATES  

 రైతును పరామర్శించిన తెల్లం వెంకట్రావు..త్వరలోనే నష్టపరిహారం అందిస్తాం..దుండగులను త్వరగా పట్టుకోవాలని సిఐ కి ఫోను..

 

మన్యం న్యూస్ చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దానవాయిపేట గ్రామానికి చెందిన కుంజా భద్రయ్య అనే గిరిజన రైతు యొక్క మిర్చి పంట ఈనెల 24 శనివారం నాడు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నిప్పు పంటకు అంటించగా దాదాపుగా నాలుగు లక్షల పంట నష్టం సంభవించిన సంగతి విధాతమే. ఎంతో కష్టపడి ఆరుకాలం అప్పు సోప్పు చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా అగ్నికి ఆహుతి అవడంతో ఆ రైతు కన్నీరు మున్నీరు అవ్వడాన్ని చూసి ప్రతి ఒక్కరూ చెలించి పోయారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ఆ రైతు ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఇట్టి విషయాన్ని స్థానికుల ద్వారా కులంకషంగా తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మతో చరవాణి ద్వారా మాట్లాడి ఇట్టి కారుకులను తొందరగా పట్టుకోవాలని కోరారు. అదేవిధంగా పంట నష్టపోయిన గిరిజనుడైన కుంజ భద్రయ్యకు త్వరలోనే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ తుర్రం రవి, గుండుజు నాగరాజు, ఇందుల రమేష్ బాబు,కల్లూరి ప్రవీణ్, తుర్రం రాజు, వేములవాడ కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !