నటి, రాజకీయవేత్త జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని జయప్రదపై 2 కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి ఆమె పై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయిన ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మార్చి 6 లోపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
