టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ విభిన్న పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గామి’. మార్చి 8న విడుదలకానున్న ఈమూవీకి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. విశ్వక్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈసినిమా హక్కులను ముందుగానే దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 4 వారాల తరువాత ఈమూవీ ఓటీటీలోకి రానుంది.
