మన్యం న్యూస్, మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కేంద్రం లోని శ్రీ చైతన్య స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అన్ని తరగతుల విద్యార్థులు ఎంతో ఉత్సాహం తో పలు రకాల వైజ్ఞానిక ప్రదర్శన లు ప్రదర్శన కు ఉంచడమే కాకుండా వాటి గురించి విచ్చేసిన అతిధులకు, తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమం కు విచ్చేసిన పలువురు వీరి వైజ్ఞానిక ప్రదర్శన లను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయికృష్ణ ప్రసాద్, డీన్ నరేష్, ఇంచార్జి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్ మొత్తం సైన్స్ మీద ఆధారపడి ఉంది అటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించి మన దేశ ప్రతిష్ట ప్రపంచంలో నలుమూలల వ్యాపింప చేయాలి, తద్వారా మిమ్మల్ని కన్న తల్లి తండ్రులకు, విద్యబుద్ధులు నేర్పిన గురువులకు, శ్రీ చైతన్య స్కూల్ కు పేరు తీసుకొని రావాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో అతిధులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.