మన్యం న్యూస్ కరకగూడెం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్లకు పెండింగ్ లోఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల వద్ద సమ్మెలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొమరం కాంతారావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీవేజ్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్లకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని డైలీ వేజ్ వర్కర్లకు ఏడు నెలలు, పోస్ట్మెట్రిక్ హాస్టల్ వర్కర్లకు 18 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్య చెందుతావుందని కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుందని అన్ని డిపార్ట్మెంట్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే హాస్టల్ వర్కర్ల మీద తీవ్ర వివక్ష కొనసాగుతుందని పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఇదివరకే అధికారులకు సంబంధిత మంత్రులకు వివిధ రూపాల్లో వినతి పత్రాలు అందజేశారని ప్రభుత్వం దృష్టికి సమస్యలను ఎన్నిసార్లు తీసుకెళ్లిన స్పందించలేదన్నారు.ఆర్థిక శాఖలో పెండింగ్ లోఉన్న వేతనాల చెక్కును వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు .వర్కర్లకు రావలసిన వేతనాలను తక్షణమే చెల్లించాలని వర్కర్ల ఖాతాలో జమ చేయాలని కాంట్రాక్ట్ వర్కర్లకు జీవో నెంబర్ 60 ద్వారా వేతనాలు చెల్లించాలని డైలీ వేజ్ వర్కర్లకు జిల్లా కలెక్టర్ సిఫారసులు మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు సమ్మెకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని సిఐటియు పేర్కొన్నది ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు చర్ప సత్యం, యువజన నాయకులు సాయి పాపారావు, హాస్టల్ వర్కర్స్ కొమరం ముసలయ్య,ఏడుల్ల పాపయ్య,చర్ప నరసింహారావు, చందా నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు చందా చంద్రకళ కొమరం కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.