ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి మాట్లాడారు. “అందరూ అనుకుంటున్నట్లు ఇది హార్రర్ స్టోరీ కాదు. ఓ నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను” అని చెప్పారు.