ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటుడు నాగబాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నోట్ విడుదల చేశారు. ‘పోలీస్ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమించండి’ అంటూ రాసుకొచ్చారు.