అల్లు అర్జున్ తన భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ‘‘మన పెళ్లై 13 ఏళ్లు అయిపోయాయి. నీ వల్లే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతోంది. నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ నాకు శక్తి ఇస్తున్నావు. చివరివరకూ మన ప్రేమ ఇలానే కొనసాగాలి. హ్యాపీ యానివర్సిరీ క్యూటీ’’ అని అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీరి సోషల్మీడియా వేదికగా అభిమానులు యానివర్సిరీ విషెస్ తెలియజేస్తున్నారు.