దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్‌కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయుకాలుష్యం తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్‌వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా. ఇవాళ ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు.