- మావోయిస్టు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్
- దళంలో మహిళలకు దుర్భర స్థితి, వంటలు చేయించుట, బ్యాగులు మోయించుట
- ఆదివాసుల మహిళా అభివృద్ధికి పోరాడదాం రండి…
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వివిధ జనసంచారిత ప్రదేశాలలో ఆదివాసుల పేరుతో మావోయిస్టుకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ మంగళవారం అర్ధ రాత్రి దర్శనమిచ్చాయి. ఆదివాసుల అభివృద్ధికి, మహిళల ప్రగతికి తోడ్పడని ఈ మావోయిస్టులను గూడెల నుంచి తరిమికొడదాం అనే ప్రధాన ఉద్దేశంతో ఈ వాల్ పోస్టర్స్ వెలిశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మావోయిస్టుల దళం చెర నుంచి మహిళలకు విముకై పోరాడుదాం, దళంలోనే మహిళలపై లింగ వివక్షతకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం, ధనంలోని మహిళలను వంట పని, బ్యాగులు మోత, నాయకుల వ్యక్తిగత పనులకు బానిసలుగా చూసే పద్ధతి నుంచి విముక్తి కలిగిద్దాం, మహిళలకు విద్య ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలను వాడుకొని ప్రగతి సాధిద్దాం, మహిళ రిజర్వేషన్ ఉపయోగించుకొని మనమే పాలకులుగా మారుద్దాం అంటూ మహిళల ప్రగతి సాధన కొరకై, ఆదివాసుల ఆడబిడ్డల అభివృద్ధికి కదం తొక్కిన మావోయిస్టుల చెర నుంచి మహిళలు ను రక్షించే విధంగా ఈ పోస్టర్స్ వెలిశాయి. ప్రజలు ఈ పోస్టర్లను చదువుతూ ఎప్పుడూ లేని విధంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆడబిడ్డల అభివృద్ధి కొరకు వారు పేరు పై ఈ పోస్టులు విడుదల కావడం మండలం మొత్తం చర్చనీయంగా మారింది.