ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు నీతా అంబానీ. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. ఈ విజయాలే ఆమెను ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది.
