మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలంటైన్’ మార్చి 1వ తేదీన విడుదలైంది. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, రుహానీ శర్మ నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంతో మాత్రం వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఇక మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
