యంగ్ హీరో సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ నటించిన తాజా చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ నిన్న శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కి తీసుకువచ్చింది. అయితే ఒక్క రోజులోనే ఈ చిత్రం ఇండియా వైడ్‌గా నెంబర్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు.
