ఫిదా’ మూవీతో ఫేమస్ అయిన నటి శరణ్య ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై శరణ్య స్పందిస్తూ.. “న్యూడ్‌గా నటించినందుకు ఇబ్బంది కలగలేదు. నా భర్త ప్రోత్సాహం, డైరెక్టర్ సహకారంతో ఆ సీన్ చేయగలిగా. నేను ఇంకేదో ఆశించి న్యూడ్‌గా నటించానని కొందరు చర్చించుకోవడం, పలు సైట్లు దారుణంగా రాయడం బాధగా అనిపించింది.” అని పేర్కొన్నారు.
