భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై అటల్ హూ’. బాలీవుడ్ సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్ పోషించారు. రవి జాదవ్ దర్శకుడు. జనవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
