- ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు.
- వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ రేగా కాళిక
- ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన
మన్యం న్యూస్ కరకగూడెం:ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక తెలిపారు. మండల కేంద్రంలోని కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల అవరణలో భద్రాచలం మిమ్స్ హాస్పిటల్ డా,,మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక ముఖ్యఅతిథిగా పాల్గొన్ని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఏజెన్సీలలో పేద ప్రజలకు మిమ్స్ హాస్పిటల్ వారు ఉచిత సేవలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు.వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ మూల ప్రాంతాల ప్రజలకు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డా,,కావ్య,కరకగూడెం వైస్ ఎంపీపీ శైలజ,సమాత్ భట్టుపల్లి మాజీ సర్పంచు పోలెబోయిన శ్రీవాణి,హాస్పిటల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.