UPDATES  

 డీపీఓ స్వరూప ఆధ్వర్యంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు…

 

గవాక్షం ప్రతినిధి మంగపేట.

ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహా జాతర గత నెల ఫిబ్రవరి 21 నుండి 24వ తేది వరకు జరిగిన సంగతి తెలిసిందే. మేడారం మహా జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరాగా జాతర సమయంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క ) ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శ్రీమతి అనిత రమచంద్రన్ పర్యవేక్షలో మేడారం జాతర పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులను చేపట్టారు. అదే విధంగా జాతర అనంతరం జాతర పరిసర ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారి ( డీపీఓ ) ( ఎఫ్ఏసీ ) నాగపురి స్వరూప పర్యవేక్షణలో పలువురు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది కార్మికులతో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. గద్దెల ప్రాంగణం, గద్దెల పరిసరాలు, శివరాంసాగర్‌చెరువు, ఆర్టీసీ బస్టాండ్, మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపురం, కొత్తూరు, పడిగాపురం, చింతల్ క్రాస్ తదితర గ్రామాల్లో చెత్తాచెదారం తొలగిస్తున్నారు. భక్తులు వదిలివేసిన వ్యర్థాలు, ప్లాస్టిక్‌కవర్లు, ఆహార పదార్థాలను ట్రాక్టర్లలో ఎత్తి డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. జాతర పరిసర గ్రామాల్లో దుర్వాసన రాకుండా బ్లీచింగ్‌పౌడర్‌ను చల్లుతున్నారు. గద్దెల వద్ద అపరిశుభ్రంగా ఉన్న ప్రాంగణాన్ని నీటితో కడిగిస్తూ ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నారు. గద్దెల ప్రాంగణంతో పాటు జాతర పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి ( డీపీఓ ) ( ఎఫ్ఏసీ ) నాగపురి స్వరూప పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ పారిశుధ్య పనులను చేయిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !