యువ నటుడు కిరణ్ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. ఐదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ రిసార్ట్స్‌లో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్.
