అల్లు అర్జున్, రామ్‌చరణ్ సినిమాల చిత్రీకరణ విశాఖలో జరగనున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ విశాఖ చేరుకోగా, త్వరలోనే రామ్‌చరణ్ రంగంలోకి దిగనున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని అక్కడ తెరకెక్కించనున్నారు. రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా చిత్రీకరణని విశాఖలో జరిపేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.
