మన్యం న్యూస్ చర్ల
తెలంగాణ,చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాలలో తిరుగుతూ ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు చర్ల సీఐ రాజు వర్మ తెలియజేశారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామానికి చెందిన కనితి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు.పూర్తి విచారణ జరిపి ఇతని వద్ద నుండి మొత్తం మూడు బైకులను స్వాధీనం పరచుకోవడం జరిగింది.జిల్లాలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఇతనిపై దాదాపుగా 20 కేసులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.ఇతనిపై గతంలో పీడి యాక్ట్ నమోదు చేయడమే కాకుండా కొన్ని కేసులలో కూడా జైలు శిక్ష అనుభవించినట్లుగా విచారణలో తేలిందని తెలిపారు.