కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయింది. నటి ప్రేమ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నాం. చిత్రీకరణ మొత్తం అయ్యాక చూసి నేనే ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తిని పాము కాటేయడంతో చనిపోయాడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు చేయలేకపోయాను‘ అనే బాధ ఉందని ప్రేమ తెలిపారు.
