యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఒక ఆధ్యాత్మికమైన టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘శివం భజే’ అనేది సినిమా పేరుగా అనౌన్స్ చేశారు. ఇక తాజాగా విడుదలైన అద్భుతమైన టైటిల్ పోస్టర్‌లో శివుని గంభీరమైన చిత్రాన్ని చూపారు. హీరో ఎత్తైన పర్వతాల నేపథ్యంలో శివుని యొక్క భారీ రూపం ముందు నిలబడి చూస్తున్నట్టు కనిపిస్తోంది.
