UPDATES  

 పార్లమెంట్ గెలుపు పై దశ దిశ…బిఆర్ఎస్ లెజెండ్స్..  మహబూబాద్ ఎంపీ అభ్యర్థి కవితని అత్యధిక మెజార్టీతో గెలిపియాలి…తాత మధు..

  • పార్లమెంట్ గెలుపు పై దశ దిశ…. బిఆర్ఎస్ లెజెండ్స్
  • మహబూబాద్ ఎంపీ అభ్యర్థి కవితని అత్యధిక మెజార్టీతో గెలిపియాలి….తాత మధు
  • పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ముందుకు సాగుదాం…..రేగ కాంతారావు

మన్యం న్యూస్ చర్ల:

 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల గెలుపు పై కార్యకర్తలకు, నాయకులకు దశ దిశ నిర్దేశిస్తు ఎమ్మెల్సీ తాతా మధు,రేగ కాంతారావు శనివారం చర్ల మండలంలోని కేఎన్ఆర్ గార్డెన్స్ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు కెసిఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజా సంక్షేమంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుందని రైతుబంధు సమయానికి అందించే పరిస్థితి లేకుండా పోయిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేర్చే అవకాశం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకోవాలని అన్నారు కేసీఆర్ నాయకత్వం తెలంగాణ మహబూబాద్ ఎంపీ కవిత అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వారికి భద్రాచలం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ కి కృషి చేయవలసిందిగా నాయకుల్ని కార్యకర్తలని కోరారు.

 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని అన్నారు, కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ వారికి అనుగుణంగా పార్టీ ముందుకు తీసుకుపోవాలని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం ఖాయమని అన్నారు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కచ్చితంగా మానుకోట అభ్యర్థిని గెలిపించుకోవడం ఖాయమని ఎంపీ కవిత మహబూబాద్ నుంచి గెలవడం తధ్యమని అన్నారు.

 

మానుకోట టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఈ రోజున ఈ ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ ఆగస్టు నెలకి ఉండదని కెసిఆర్ గారు టిఆర్ఎస్ జండా తో పాటు జాతీయ జెండా ఎగరవేయడం ఖాయమని మహబూబాద్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, రైతు నాయకులు వాసు రాజుగారు డివిజన్ నాయకులు మానే రామకృష్ణ , టిఆర్ఎస్ జిల్లా నాయకులు తాండ్ర వెంకటరమణ రావు గారు డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, వెంకటాపురం నరసింహమూర్తి కోటగిరి ప్రమోద్ కుమార్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, భద్రాచలం నాయకులు పుడతా రమేష్ తాండ్ర నరసింహారావు రేపాక పూర్ణచంద్రరావు బండారు నాగేశ్వరరావు

ఆంకోజు సునీల్,కోలా రాజు తుమ్మలపల్లి ధనం మాస్టర్ వెంకటేశ్వరరావు గారు ుమ్ముగూడెం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అన్నం సత్యాలు చర్ల మండల టిఆర్ఎస్ అధ్యక్షులు సోయం రాజారావు కోటేరు శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ కోదండ రామయ్య గారు, టిఆర్ఎస్ అధ్యక్షులు గంపా రాంబాబు, ఈ కార్యక్రమంలో చర్ల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !