మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం కమలాపురం సుభాష్ చంద్రబోస్ కాలనీ కి చెందిన పిల్లుట్ల మస్తానమ్మ అనే ఈ మహిళ సుమారు గత 25 ఏళ్ళ క్రితం మతి స్థిమితం కోల్పోయింది. మస్తానమ్మ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫించను సాయం కూడా లేదు. ప్రస్తుతం ఈమె బాగోగులను ఈమె చెల్లె చూస్తుంది.ఇదే విధంగా గుడ్డేలుగులపల్లి కి చెందిన మాటూరి సమ్మక్క మాటూరి నర్సయ్య (లేట్) ఒక కుమారుడు వీరు కూడా చాలా బీద కుటుంబం ఉండటానికి ఇల్లులేక కిరాయి ఇంట్లో ఉంటుంది కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు వీరి పరిస్థితి కూడా తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్టు వారు తాటి రమాణాకర్ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ గౌరవకార్యవర్గసభ్యులు వారి పెళ్ళిరోజు సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25కేజీల బియ్యం, 1000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవసలహాదారులు కోలగట్ల నరేష్ రెడ్డి ,సయ్యద్ బాబా గారు ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గారు, ప్రదానకార్యదర్శి మునిగాల రాకేష్ ఉపాధ్యక్షులు కస్పా ముకుందం ప్రచారకార్యదర్శి గుగ్గురి మహేష్ కార్యవర్గ సభ్యులు గోలి నరేష్,రోహిత్,రమేష్ పాల్గొన్నారు.