పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘ఓజీ’ మూవీ గ్లింప్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం. ఓజీ మూవీలో తన రోల్ గురించి చెప్పమని బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీను ఓ నెటిజన్ అడగ్గా.. ‘నేను దీని గురించి ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రాబోతోంది’ అని రిప్లై ఇచ్చారు
