నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘‘ఈ సినిమాలో నేను నజీబ్ అనే బానిస పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను. జోర్డాన్ ప్రాతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్‌డౌన్ ప్రకటించారు. మూడు నెలలు జోర్డాన్ రాయల్ ఫిల్మ్ కమిషన్ మమ్మల్ని ఆదరించింది‘‘ అని పృథ్వీరాజ్ వెల్లడించారు.
