టాలీవుడ్ డైరెక్టర్ తేజ ప్రస్తుతం రానాతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నేను కెమెరామెన్‌గా ఉన్నప్పుడు చెక్క బోర్డు మీద చాక్ పీస్‌తో రాసి క్లాప్ కొట్టేవాళ్ళు. నేను దర్శకుడిగా మారాక తొలి మూవీ చిత్రంకు ఆక్రలిక్ బోర్డు తయారుచేయించి, దానిపై మార్కర్‌తో రాసి క్లాప్ కొట్టించాను. సినీ పరిశ్రమలో నేనే అది మొదటిసారి వాడాను. తర్వాత అందరూ వాడారు’ అని తెలిపారు.
