పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ టీం ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘ఎక్స్‌పెక్ట్ ది అన్ ఎక్స్‌పెక్టెడ్’ మార్చి 19న రాబోతోందని ట్వీట్ చేసింది. దీంతో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారని, ఇందులో పవన్ డైలాగ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
