UPDATES  

 శ్రీ నాగులమ్మ తల్లి జాతర కరపత్రం ఆవిష్కరణ…

మన్యం న్యూస్ మంగపేట.

మంగపేట మండలంలోని వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీనర్సాపూర్ గ్రామం లో సోమవారం నాడు శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారులు ,వడ్డెలు సమావేశం ఏర్పాటు చేసి,శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ(మినీ జాతర) తేది లను ప్రకటించి ,జాతర కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త,ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ మాట్లాడుతూ అమ్మవారి సుంకు పండగ ను మార్చి 26 నుండి మార్చి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 26 మంగళవారం రోజున మండె మెలుగుట,27 బుధవారం రోఊ అమ్మవారికి ప్రత్యేక పూజలు,28 గురువారం రోజున “సుంకు పండగ” నిర్వహించడం జరుగుతుందని,ఈ పూజా కార్యక్రమం లో భాగంగా గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి,పవిత్ర స్నానాలు చేయడం జరుగుతుందని,ఇదే రోజు గురువారం రాత్రి అమ్మవారికి సంబంధించిన యేల్పుల యొక్క “డాలు గుడ్డ” కు ఆదివాసీ సాంప్రదాయ బద్దం గా పూజారులతో పూజలు నిర్వహించి ,ఆర్తి బిడ్డల డోలు వాయిద్యాల తో ప్రదర్శించడం జరుగుతుందని,29 శుక్రవారం నాడు అమ్మవారి ఊరేగింపు మహోత్సవం నిర్వహించడం జరిగుతుందని తెలిపారు.ఈ సమావేశానికి హాజరైన వారి లో ఆలయ ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్,నవీన్,ముయబోయిన శివ,సోడి శ్రీను,వడ్డెలు మడకం లక్ష్మయ్య,కుర్సం పుల్లయ్య,కట్టం సమ్మక్క,ఈసం సమ్మక్క,చౌలం భవాని,మడకం సుప్రజ,కుర్సం వీరమ్మ,పోలిశెట్టి పావని,స్వరూప,కారం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !