లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు పంపుతోంది. మోదీ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు ఇవ్వాలని అడుగుతోంది. అయితే ఈ మెసేజ్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముంది. వికసిత్ భారత్ మెసేజ్ 9275536906, 9275536919 నంబర్లతో మాత్రమే వస్తుందని, ఇతర నంబర్లతో వస్తే అది ఫేక్ అని, రిప్లై ఇవ్వొద్దని సూచిస్తున్నారు.
