మన్యం న్యూస్ మంగపేట.
రాజపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల భాస్కర రావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గాదరి రమాదేవి జిసిడిఓ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు పక్కా ప్రణాళికతో నిరంతరం కృషి చేస్తే అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని సూచించారు. పదవ తరగతి అనంతరం అవకాశాలు ఉద్యోగాలపైన చదువుల పైన, ఇంటర్మీడియట్ తో ఉద్యోగ అవకాశాలు వృత్తి విద్యా కోర్సులు ఉద్యోగ అవకాశాలు పూర్తిస్థాయిలో వివరించడం జరిగింది. విద్యార్థులు తమలోని బలాలను బలోపేతం చేసుకోవాలని బలహీనతలను బలహీనపరచాలని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఇష్టపడి చదవాలని ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. అనంతరం పిల్లలకు మానసిక పరిదికి సంబంధించిన మానసిక పరీక్ష నిర్వహించి విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గైడ్ టీచరుగా పాయం వీరనారాయణ, పావని జమున వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.