ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. భాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమా “హనుమాన్’. కేవలం రూ. 40 కోట్లతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రశాంత్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా హనుమాన్ మూవీ ఖాతాలో తొలి అవార్డు నమోదైంది. రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్ లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు.