శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తన పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 6న స్నేహితులు శిఖర్ పహారియా, ఒరీతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. తిరుమల టూర్ ఎలా జరిగిందో తెలియజేశారు. చెన్నైలోని జాన్వీ నివాసం నుంచి కారులో 3 గంటలు ప్రయాణించి తిరుపతి చేరుకున్నామన్నారు. ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ – శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారు.